196
అక్షరటుడే, హైదరాబాద్: high-speed corridors | తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం 2026-27 సంవత్సరానికి గాను గరిష్ట స్థాయిలో రూ. 5,454 కోట్ల నిధులు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మీడియా సమావేశంలో 2026 బడ్జెట్ ముఖ్యాంశాలు వెల్లడించారు. తెలంగాణలో రైలు నెట్వర్క్ అభివృద్ధి కోసం రూ. 47,984 కోట్లతో వివిధ రైల్వే ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు.
సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2026-27 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ.5,454 కోట్ల బడ్జెట్ కేటాయింపులు మంజూరు చేసినట్లు తెలిపారు.
2009-14 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్షిక సగటు బడ్జెట్ వ్యయం రూ. 886 కోట్లు మాత్రమే అని ఆయన గుర్తుచేశారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు 2009-14 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రానికి జరిగిన సగటు కేటాయింపులతో పోలిస్తే సుమారు ఆరు రెట్లు పెరిగిందన్నారు.
high-speed corridors | మూడు కారిడార్లు..
దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు. ఈ ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు హైదరాబాద్ మీదుగా ఉండటం గమనార్హం. ఈ 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కారిడార్లు విద్య, ఆరోగ్యం, వ్యాపారం మొదలైన వాటికి దోహదపడే ఆర్థిక వృద్ధికి ఊతం ఇస్తాయి.
ఈ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల హైదరాబాద్ Hyderabad – బెంగళూరు Bengaluru మధ్య ప్రయాణ సమయం 2 గంటలు, హైదరాబాద్ – చెన్నై chennai 2.55 గంటలు, హైదరాబాద్ – ఫుణె pune మధ్య ప్రయాణ సమయం 01.55 గంటలు ఉంటుందని అంచనా.