2
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే హైదరాబాద్ hyderabad జూబ్లీహిల్స్‌లోని రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ Consulate General of Turkey వద్ద కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’(operation sindoor)కు ప్రతీకారంగా పాక్ భారత్‌పై డ్రోన్లతో దాడులు చేసింది. అయితే ఆ డ్రోన్లు టర్కీకి చెందినవి కేంద్రం తెలిపింది. దీంతో పాక్‌కు డ్రోన్లు అందించిన టర్కీకి వ్యతిరేకంగా కాన్సులేట్ జనరల్ వద్ద ఆందోళన చేసే అవకాశం ఉండడంతో భద్రతను పటిష్టం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, కార్యాలయం సమీపంలో పోలీసులు ఆంక్షలు విధించారు.