అక్షరటుడే, బాన్సువాడ: CMRF checks | పేదల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో శనివారం నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
CMRF checks | నియోజకవర్గంలో 341 లబ్ధిదారులకు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజవర్గంలో 341మంది లబ్ధిదారులకు రూ. 1.10 కోట్ల చెక్కులు పంపిణీ చేసినట్లు పోచారం తెలిపారు. బాన్సువాడ మండలానికి 73, బీర్కూరు మండలానికి 41, నస్రుల్లాబాద్ (Nasrullabad) మండలానికి 31, కోటగిరి 23, పోతంగల్ 35, రుద్రూర్ 36, వర్ని 43, చందూరు 19, మోస్రా మండలానికి 34 ఇతర ఆరుగురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, బీర్కూరు, వర్ని, కోటగిరి మార్కెట్ కమిటీల ఛైర్మన్లు శ్యామల, సురేష్ బాబా, హనుమంతు, నాయకులు ఎజాజ్, నార్ల సురేష్, మోహన్ నాయక్, జంగం గంగాధర్, మధుసూదన్ రెడ్డి, మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.