అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Liquor Case | ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాం కేసులో (Liquor Scam Case) నిందితుల విడుదల సందర్భంగా ఆదివారం హైడ్రామా చోటు చేసుకుంది. కోర్టు శనివారమే బెయిల్ ఇచ్చినా విడుదల చేయడంలో జైలు అధికారులు తాత్సారం చేయడం తీవ్ర ఉత్కంఠ రేపింది.
అదే సమయంలో బెయిల్‌ను (Bail) రద్దు చేయాలని ఏపీ సర్కారు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో నిందితుల విడుదలపై తీవ్ర సస్పెన్స్ నెలకొంది. అయితే, పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి కోర్టు సమయం తీసుకోవడంతో ముగ్గురు నిందితులను విడుదల చేయక తప్పలేదు. రిటైర్డ్ అధికారి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను విజయవాడ జైల (Vijayawad Jail) నుంచి విడుదల చేయడంతో ఉత్కంఠకు తెర పడింది.
AP Liquor Case | పలువురి అరెస్టు..
జగన్ ప్రభుత్వ (Jagan Government) హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీగోవిందప్ప తదితరులు అరెస్టయ్యారు. ఏపీ లిక్కర్ కేసులో (AP Liqour Case) సిట్ అధికారులు మే 13న బాలాజీ గోవిందప్పను, మే 16న ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జూలై 19న ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టయ్యారు. అయితే, బెయిల్ ఇవ్వాలని నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు (ACB Court) మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్‌రెడ్డి విడుదల అయ్యారు. మరోవైపు, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారించిన ఏసీబీ కోర్టు.. తీర్పును ఈ నెల 10కి వాయిదా వేసింది.
AP Liquor Case | విడుదలలో జాప్యం
అయితే, కోర్టు బెయిల్ ఇచ్చినా విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడం తీవ్ర ఉత్కంఠకు రేకెత్తించింది. శనివారం బెయిల్ మంజూరైనా అఫిషియల్ ఫార్మాలిటీస్ పూర్తి కాలేదు. ఆదివారం ఉదయం వారు జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా, ఆలస్యం జరిగింది. ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ సిట్ అధికారులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో వీరి ముగ్గురికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును (High Court) ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని నిందితుల తరఫు న్యాయవాదులు జైలు ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్దేశ్యపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టకేలకు విజయవాడ జైలులో ఉన్న రిటైర్డ్ అధికారి ధనుంజయ్ రెడ్డిసహా కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు జైలు నుంచి విడుదలయ్యారు.
AP Liquor Case | అంబటి ఫైర్..
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదలలో జాప్యం కావడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం బెయిల్ వస్తే వెంటనే విడుదల చేయకుండా ఆలస్యం చేశారన్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారని, కానీ తొమ్మిది దాటినా రిలీజ్ చేయలేదన్నారు. నిందితులు జైలు నుంచి బయటకు రాకుండా ఉండేలా లంచ్ మోహషన్ వేయాలని ఆలస్యం చేశారని అంబటి ఆరోపించారు. కోర్టు బెయిల్ ఇచ్చినా.. వాళ్ళను బయటకు పంపవద్దని జైలర్‌కు చంద్రబాబు, లోకేశ్ చెప్పారన్నారు.