HomeUncategorizedRamdev Baba | రామ్‌దేవ్ బాబాపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు.. సొంత ప్ర‌పంచంలో జీవిస్తున్నాడని అస‌హ‌నం

Ramdev Baba | రామ్‌దేవ్ బాబాపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు.. సొంత ప్ర‌పంచంలో జీవిస్తున్నాడని అస‌హ‌నం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Ramdev Baba | ప్ర‌ముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై హైకోర్టు(High Court) గురువారం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఆయ‌న ఎవ‌రి నియంత్ర‌ణ‌లో లేడ‌ని, త‌న సొంత ప్ర‌పంచంలో జీవిస్తున్నాడ‌ని వ్యాఖ్యానించింది. హ‌మ్దార్ద్ శీత‌ల పానీయ‌మైన రూహ్ అఫ్జా(Rooh Afza)కు వ్య‌తిరేకంగా బాబా రామ్‌దేవ్(Baba Ramdev) చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. పతంజలి(Patanjali) ఉత్ప‌త్తి చేసే గులాబ్ ష‌ర్బాత్‌ను మాత్ర‌మే తాగాల‌ని రామ్‌దేవ్ కోరారు. రూహ్ అఫ్జా త‌న ఉత్ప‌త్తుల నుంచి వచ్చే లాభాలను మ‌ద‌ర్సాలు, మ‌సీదులు నిర్మించ‌డానికి ఉపయోగిస్తుంద‌ని, ష‌ర్బ‌త్ జిహాద్‌(Sharbat Jihad)కు పాల్ప‌డుతోంద‌న్నారు. శీత‌ల పానీయాన్ని ష‌ర్బ‌త్ జీహాద్‌గా పేర్కొంటూ, త‌మ ఉత్ప‌త్తుల‌ను వినియోగించాల‌ని చేసిన ప్ర‌క‌ట‌న తీవ్ర దుమారం రేపింది. ఈ నేప‌థ్యంలో హమ్దార్డ్ నేషనల్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన జ‌స్టిస్ అమిత్ బ‌న్సాల్ రామ్‌దేవ్ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

Ramdev Baba | ధిక్కారానికి పాల్ప‌డ్డారు..

గ‌త విచార‌ణ సంద‌ర్భంగా త‌న వ్యాఖ్య‌ల‌పై రామ్‌దేవ్ బాబా విచారం వ్య‌క్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియోలు(Videos), సోషల్ మీడియా పోస్ట్‌(Social Media Posts)లను వెంటనే తొలగిస్తానని రామ్‌దేవ్ కోర్టుకు హామీ ఇచ్చారు. దాన్ని నెర‌వేర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని కోర్టు తాజాగా గుర్తించింది. గ‌తంలో కోర్టుకు ఇచ్చిన హామీల‌ను ఆయ‌న ఉల్లంఘించార‌ని పేర్కొన్నారు. హ‌మ్దార్ద్(Hamdard) ఉత్ప‌త్తుల గురించి చేసిన ప్ర‌క‌ట‌న‌లు, వీడియాల‌ను తొల‌గించాల‌ని ఏప్రిల్ 22న ఆదేశించిప్ప‌టికీ, ఇప్ప‌టికీ వాటిని తొల‌గించలేద‌ని న్యాయ‌మూర్తి అమిత్ బన్సాల్(Judge Amit Bansal) పేర్కొన్నారు. అతను గ‌తంలో ఇచ్చిన అఫిడవిట్, అలాగే ఈ వీడియో రామ్‌దేవ్ ధిక్కారానికి పాల్ప‌డిన‌ట్లు ప్రాథ‌మిక ఆధార‌మ‌ని జస్టిస్ బన్సాల్ పేర్కొన్నారు.”అతను (రామ్‌దేవ్) ఎవరి నియంత్రణలో లేడు. అతను తన సొంత ప్రపంచంలో నివసిస్తున్నాడు” అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Must Read
Related News