అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) 2012 సంవత్సరంలో జరిగిన అక్రమ నియామకాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్ డిమాండ్ చేశారు.
కోర్టు తీర్పు వెలువరించి చాలా రోజులైనా ఇప్పటికీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు తీర్పుని (High Court verdict) వెంటనే అమలు చేయాలని ఆందోళనలు నిర్వహించినా.. వీసీని కలిసి హైకోర్టు తీర్పు కాపీని అందజేసినా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ ఉన్నతాధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించకపోవడంపై.. వీసీ, రిజిస్టార్పై కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. అక్రమ అర్కులకు కొమ్ముకాస్తున్న వీసీ, రిజిస్టార్ తగిన మూల్యం చెల్లించక తప్పద ఆయన హెచ్చరించారు. సమావేశంలో విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు జవారే రాహుల్, బైరాపూర్ రవీందర్, కె.శివప్రసాద్, బి. ప్రశాంత్, S.సతీష్, సాయికుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
