Telangana University | హైకోర్టు తీర్పును అమలు చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమ నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ డిమాండ్​ చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ (Telangana University) రిజిస్టార్ ప్రొఫెసర్ యాదగిరికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2012లో అక్రమ నియామకాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును […]

అక్షరటుడే, ఇందూరు: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమ నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ డిమాండ్​ చేశారు.

ఈ మేరకు యూనివర్సిటీ (Telangana University) రిజిస్టార్ ప్రొఫెసర్ యాదగిరికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2012లో అక్రమ నియామకాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడం సరికాదన్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందలేదని చెబుతూ గత 15 రోజులుగా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తీర్పులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

Related articles

Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రకోటతో పాటు రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్​ పంపారు.

Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.