అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | బీసీ రిజర్వేషన్లపై (BC reservations) హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు రమణ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకపోయినా, గవర్నర్ బిల్లు ఆమోదించకపోయినా, సీఎం ఒంటరి పోరాటం చేశారన్నారు.
సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజర్వేషన్లు కల్పించామన్నారు. హైకోర్టు స్టేతో బీసీలు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారని పేర్కొన్నారు. అయినా తమ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ (BRS and BJP) ఇప్పటికైనా బీసీల ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు. బీసీలు ఎవరూ అధైర్యపడొద్దని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పని సరిగా రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు.