ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Engineering Colleges | ఇంజినీరింగ్​ కాలేజీలకు హైకోర్టు షాక్​.. ఫీజుల పెంపునకు నో

    Engineering Colleges | ఇంజినీరింగ్​ కాలేజీలకు హైకోర్టు షాక్​.. ఫీజుల పెంపునకు నో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering Colleges | రాష్ట్రంలోని ఇంజినీరింగ్​ కాలేజీలకు హైకోర్టు(High Court) షాక్​ ఇచ్చింది. ఫీజుల పెంచాలన్న కళాశాలల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

    రాష్ట్రంలోని పలు ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీలు (Private Medical Colleges) ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాయి. ఖర్చులు పెరిగాయని, నాణ్యమైన విద్యకు తగిన వనరులు కావాలంటూ ప్రైవేట్ కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అయితే మాత్రం కాలేజీల పిటిషన్​ను తోసిపుచ్చింది. ఆరు వారాలలోపు ఇంజినీరింగ్‌ ఫీజులను నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి ఆదేశించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

    Engineering Colleges | తల్లిదండ్రులకు ఊరట

    ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజినీరింగ్​ కాలేజీల్లో రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. కాలేజీల స్థాయిని బట్టి ఫీజులు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్ (Government Fee Reimbursement)​ రూపంలో రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తోంది. ఎస్సీ, ఎస్టీలు, పది వేలలోపు ర్యాంకు వచ్చిన వారికి, ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్​ చదివిన వారికి మాత్రం మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఫీజులు అధికంగా ఉన్నాయి.

    READ ALSO  Sri chaitanya School | ‘శ్రీచైతన్య’లో తరగతుల నిర్వహణకు డీఈవో అనుమతి నిరాకరణ

    ఈ క్రమంలో తాజాగా ఫీజుల పెంపునకు కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులకు ఊరట లభించింది. గతంలో 2022లో ప్రైవేట్​ కాలేజీలు ఫీజులు పెంచాయి. తాజాగా మళ్లీ పెంచాలని చూడగా.. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు సాగాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పటికే ఇంజినీరింగ్​ కాలేజీల్లో అడ్మిషన్​కు కౌన్సెలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్​, వెబ్​ ఆప్షన్ల నమోదు పూర్తయింది. జులై 13న తొలి విడత సీట్లు కేటాయించనున్నారు.

    Latest articles

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ England అద్భుతంగా పుంజుకుంది… నాల్గో...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గురువారం సెషన్‌లో యూఎస్‌,...

    Today Gold Price | మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు (Gold rates)  ప‌రుగులు...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    More like this