అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ సంఘాలు (NSUI and PDSU unions) డిమాండ్ చేశాయి. ఈ మేరకు వర్సిటీలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ తెలంగాణ యూనివర్సిటీ (NSUI Telangana University) మాజీ అధ్యక్షుడు కొమిర శ్రీశైలం, పీడీఎస్‌యూ నాయకులు అనిల్‌కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీలో నియామకాలు చట్టవిరుద్ధంగా జరిగాయని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. వారి తొలగించాలని తీర్పు వెల్లడించిందన్నారు. ఆ తీర్పును అమలు చేయకుండా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana University | తప్పుడు పత్రాలతో చలామణి అవుతూ..
అంతేకాకుండా దాదాపు 13 ఏళ్లుగా తప్పుడు సర్టిఫికెట్లతో (false certificates) చలామణి అవుతున్న ప్రొఫెసర్లు, ఉద్యోగుల వేతనాలు తిరిగి రాబట్టేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును (High Court verdict) అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ నాయకులు రాజు, గోవింద్, మహేష్, అరుణ, పవిత్ర, సంధ్య, నవీన్ కుమార్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
