7
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: High Court Judge | రాష్ట్ర హైకోర్టు జడ్జి మాధవి దేవి (High Court Judge Madhavi Devi) జిల్లాలో పర్యటించారు. బాసరలోని సరస్వతి దేవి పుణ్యక్షేత్రాన్ని (Saraswati Devi temple) దర్శించుకోవడానికి శనివారం వెళ్తూ.. జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో కొద్దిసేపు ఆగారు.
జిల్లా జడ్జి భరత లక్ష్మి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మర్యాదపూర్వకంగా హైకోర్టు జడ్జిని కలిశారు. ఏడీజే హరీష, శ్రీనివాస్, ఏడీఎం కుష్బూ, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తదితరులు ఆమెను కలిశారు.