Terror Attack | జమ్మూ కశ్మీర్​లో హై అలర్ట్​.. జైళ్లపై దాడులకు అవకాశం
Terror Attack | జమ్మూ కశ్మీర్​లో హై అలర్ట్​.. జైళ్లపై దాడులకు అవకాశం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | జమ్మూ కశ్మీర్‌ jammu kashmirలో హై అలర్ట్ కొనసాగుతోంది. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు security forces అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా కశ్మీర్​లోని జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించాయి. పలు జైళ్లలో ఉగ్రవాదులు ఉండటంతో వారికోసం దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో అధికారులు జైళ్ల వద్ద భద్రతను పెంచారు. జమ్మూ కశ్మీర్​లోని జైళ్ల భద్రతను సీఐఎస్​ఎఫ్​ చూస్తుంది.

Terror Attack | కొనసాగుతున్న దర్యాప్తు

పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్​ఐఏ nia విచారణ కొనసాగుతోంది. జైలులో ఉన్న ఉగ్రవాదులు నిసార్, ముష్తాక్‌ను అధికారులు విచారించారు. ఆర్మీ వాహనంపై దాడికేసులో నిసార్, ముష్తాక్ అరెస్ట్​ అయి జైలులో ఉన్నారు. వీరిని అధికారులు విచారించి కీలక సమచారం సేకరించారు.

Terror Attack | ముమ్మురంగా గాలింపు

పహల్గామ్​ ఉగ్రదాడికి పాల్పడిన వారు దక్షిణ కశ్మీర్‌ అడవుల్లోనే forest ఉన్నట్లు భద్రత బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో ఆ అడవుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పహల్గామ్‌ ఉగ్రదాడి జరిగిన ప్రాంతం నుంచి 20 కిలో మీటర్ల మేర సెర్చ్​ ఆపరేషన్​ search operation పూర్తి చేశాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్​లోని పూంచ్​ జిల్లాలో భద్రత బలగాలు ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించాయి. కమ్యూనికేషన్​ పరికరాలు, ఐదు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి.