HomeతెలంగాణHeavy rain forecast | హై అలెర్ట్​.. భారీ వర్ష సూచన.. ఆ ప్రాంతవాసులు జాగ్రత్త!

Heavy rain forecast | హై అలెర్ట్​.. భారీ వర్ష సూచన.. ఆ ప్రాంతవాసులు జాగ్రత్త!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain forecast : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం (ఆగస్టు 08) రాత్రి ఇప్పటికే గ్రేటర్​ హైదరాబాద్(Greater Hyderabad)​లోని పలు ప్రాంతాల్లో వాన మొదలైంది. ఈ రోజు రాత్రికి పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

Heavy rain forecast : ఈ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​..

కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురవనున్నట్లు వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Heavy rain forecast : వీటిల్లో ఎల్లో అలెర్ట్​..

మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (Meteorological Department) వెల్లడించింది.

ఈ రోజు రాత్రి ఒంటి గంట వరకు భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కర్షకులు పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించింది. కరెంటు తీగలకు దూరంగా ఉండాలని, రాత్రుల్లో మోటార్లు వేయకుండా జాగ్రత్త వహించాలని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లొద్దని, ఇళ్లలోనే ఉండాలని స్పష్టం చేసింది.