HomeUncategorizedAirports | ఎయిర్‌పోర్టుల్లో హైఅల‌ర్ట్‌.. ముప్పు పొంచి ఉంద‌న్న నిఘా వ‌ర్గాలు

Airports | ఎయిర్‌పోర్టుల్లో హైఅల‌ర్ట్‌.. ముప్పు పొంచి ఉంద‌న్న నిఘా వ‌ర్గాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Airports | దేశంలోని అన్ని విమానాశ్ర‌యాల్లో హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు అప్ర‌మ‌త్తంగా ఉంచాల‌ని ఆదేశించారు. ఉగ్ర‌వాదులు లేదా సంఘ విద్రోహ శ‌క్తుల నుంచి ముప్పు పొంచి ఉంద‌న్న నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల మేర‌కు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ (High Alert) జారీ చేసింది. విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్‌లు, ఫ్లయింగ్ స్కూల్‌లు, శిక్షణా సంస్థలు సహా అన్ని విమానయాన సంస్థలలో భద్రతా చర్యలను పెంచాలని ఆదేశించింది.

Airports | ఉగ్ర ముప్పు..

సెప్టెంబర్ 22-అక్టోబర్ 2 మధ్య సామాజిక వ్యతిరేక శక్తులు లేదా ఉగ్రవాద గ్రూపుల నుంచి విమానాశ్రయాలకు ముప్పు పొంచి ఉందని నిఘా వ‌ర్గాల నుంచి స‌మాచారం అందింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ అన్ని విమానాశ్రయాలు (Airports), ఎయిర్‌స్ట్రిప్‌లు, ఎయిర్‌ఫీల్డ్‌లు, ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు, హెలిప్యాడ్‌లు వంటి అన్ని పౌర విమానయాన సంస్థల వద్ద భద్రతా చర్యలను పెంచాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (Bureau of Civil Aviation Security) అడ్వైజ‌రీ జారీ చేసింది.

Airports | నిఘా హెచ్చ‌రిక‌లు..

పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ (Pakistani Terrorist Organization) కార్యకలాపాలకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. స్థానిక పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau), ఇతర సంబంధిత ఏజెన్సీలతో ట‌చ్‌లో ఉండాల‌ని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచించింది. ఏవైనా హెచ్చరిక‌లు వ‌స్తే, అనుమానాస్ప‌ద వ‌స్తువులు క‌నిపిస్తే వెంట‌నే స‌మాచార‌మివ్వాల‌ని ఆదేశించింది. విమానాశ్ర‌యాల్లో ప‌ని చేసే సిబ్బందితో పాటు ప్ర‌యాణికులను క్షుణ్ణంగా త‌నిఖీ చేయాల‌ని సూచించింది. సీసీ టీవీ ప‌నితీరుపై త‌ర‌చూ ప‌ర్య‌వేక్షించాల‌ని తెలిపింది.