అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Terror Attack | జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో మళ్లీ ఉగ్రదాడి Terror attack జరగొచ్చని నిఘా వర్గాలు Intelligence agencies హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు Security forces అప్రమత్తం అయ్యాయి. పహల్ గామ్ లో ఇటీవల పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 28 మంది మృతి చెందారు. ఈ దాడితో అప్రమత్తమైన నిఘా వర్గాలు ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో మళ్లీ దాడి చేయడానికి ఉగ్రవాదులు యత్నిస్తున్నట్లు ఐబీ IB అధికారులు గుర్తించారు. లష్కరే తొయిబా Lashkar-e-Taiba దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. పర్యాటక స్థలాల్లో భద్రత పెంచాయి. కశ్మీర్ లోయలో భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ Srinagar లాల్‌చౌక్ సహా టూరిస్టు ప్రాంతాల్లో భద్రతను పెంచారు.