HomeUncategorizedHeroine Kajol | నా కూతురి జోలికి వ‌స్తే కారు ఎక్కించి మ‌రీ చంపేస్తానంటూ కాజోల్...

Heroine Kajol | నా కూతురి జోలికి వ‌స్తే కారు ఎక్కించి మ‌రీ చంపేస్తానంటూ కాజోల్ వార్నింగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Heroine Kajol | నాటి యువతరం కలలరాణి కాజోల్‌ (Kajol) ఇప్పుడు బీ టౌన్‌లో చర్చనీయాంశంగా నిలిచారు. ఆమె నటించిన ‘మా’ అనే సినిమా (MAA Movie) జూన్ 20న విడుద‌లైంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఆమె ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇటీవ‌ల‌ రామోజీ ఫిల్మ్ స్టూడియోపై (Ramoji Film Studio) సంచలన వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్(Hyderabad)లో ఉన్న ఈ ఫిల్మ్ స్టూడియోలో తనకు నెగిటివ్ వైబ్స్ వచ్చాయని, అక్కడ దెయ్యాలు ఉన్నాయన్నట్లు చెప్పుకొచ్చింది. ‘ షూటింగ్ చేస్తున్న సమయంలో నెగిటివ్ వైబ్స్ వస్తాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి ఆ తరువాత ఎప్పుడు అక్కడకు వెళ్లాలనిపించదు.

Heroine Kajol | ఊరుకునేదే లేదు..

అలాంటి వాటిలో హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ స్టూడియో (Ramoji Film City Studio) ఒక‌టి. ప్రపంచంలోనే ఎక్కువ భయపెట్టే హాంటెడ్ ప్లేస్ లలో రామోజీ ఫిల్మ్ సిటీ ఒకటి ‘ అని చెప్పుకొచ్చింది. కాజోల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాను (Social Media) షేక్ చేశాయి. ఇక తాజాగా త‌న కూతురిని ట్రోల్ చేసే వారికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. నా కూతుర్ని (Daughter) విమర్శించే వాళ్ళు ఎవరూ నా కారు ముందుకు రావద్దు. ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్‌ మీడియాలో వెయ్యి మెసేజ్లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది, మీరు అమేజింగ్‌.. అని ఉంటాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రం బ్యాడ్‌ కామెంట్‌ (Bad Comments) ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు.

అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను. చెడు గురించి కాదు అని చెప్పుకొచ్చింది. కాజోల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచిత‌మే. తెలుగులో సినిమాలు చేయకపోయినా దిల్ వాలే దుల్హనియా లేజాయింగే (Dilwale Dulhania Lejayenge) సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన కాజోల్.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అజయ్ దేవగణ్(Ajay Devgan)ను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చి బిజీగా మారింది.అజయ్‌ దేవ్‌గణ్ ని 1999 లో పెళ్లి చేసుకున్నారు కాజోల్. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్‌ పుట్టాడు.