అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heroine Hansika | హిందీలో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించిన హన్సిక మోత్వానీ, (Hansika Motwani) బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు అందుకోలేక, సౌత్ ఇండియన్ సినిమాలపై దృష్టి సారించింది. తెలుగులో అవకాశాలు కోసం ప్రయత్నిస్తూ, అల్లూ అర్జున్ (Allu Arjun) జోడీగా “దేశముదురు” సినిమాలో టాలీవుడ్ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హిందీ, కన్నడ భాషలలో కూడా నటించిన హన్సిక, తన ప్రతిభతో ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.
Heroine Hansika | తెలుగు నుంచి తమిళం
తెలుగులో యంగ్ హీరోలతో వరుసగా నటించిన తర్వాత, తమిళ్‌లోకి ప్రవేశం చేసింది. దర్శకుడు సురాజ్, ధనుష్ హీరోగా తెరకెక్కించిన “మాప్పిళ్లై” సినిమాతో కోలీవుడ్‌లోకి (Kollywood) ఎంట్రీ ఇచ్చిన హన్సిక, మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తమిళ ఫ్యాన్స్ ఆమెను “చిన్న కుష్బూ” అని పిలిచేవారు. తర్వాత “ఎంగేయుమ్ ఎప్పోదుమ్”, “వేలాయుధం” వంటి సినిమాల్లో టాప్ హీరోలతో నటించింది. హన్సిక క్రేజ్‌కి తమిళనాట ఆమెకి గుడి Temple కూడా కట్టారు. స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలో, నటుడు శింబుతో (actor Simbu) ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. వారిరివురు వివాహం చేసుకోవడం గ్యారెంటీ అని అభిమానులు భావించిన, కేవలం 3 నెలల్లోనే వారి ప్రేమకు బ్రేకప్ పడింది. ఆ తర్వాత హన్సిక తిరిగి తమిళ సినిమాలపై దృష్టి సారించింది.
కొన్ని సంవత్సరాల తర్వాత, తన స్నేహితురాలి మాజీ భర్త, వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాతో ప్రేమలో పడిన హన్సిక, 2022లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.వివాహం జరిగి మూడేళ్లు కూడా పూర్తి కాకముందే, సోహైల్ ఖతురియాతో మనస్పర్థల వలన విడాకులు తీసుకుందని కొద్ది రోజులుగా వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. హన్సిక తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా నుండి తీసేసింది.
వినాయక చవితి, దీపావళి (Vinayaka Chavithi and Diwali) వంటి పండుగలను కూడా ఇద్దరూ వేర్వేరు జరుపుకున్నారని టాక్. విడాకుల వివాదం నడుస్తున్న వేళ, హన్సిక సడెన్‌గా తన ఇంటి పేరు మార్చింది. ఇంగ్లీషులో “Motwani”ను ఇప్పుడు “Motwanni”గా మార్చింది. కారణం ఆమె వెల్లడించకపోయినా, సోషల్ మీడియా ఫ్యాన్స్ వివరణ కోరుతున్నారు. కొంతమంది అభిప్రాయం ప్రకారం, సినిమా అవకాశాలు లేకపోవడం, న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చినట్టు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంకొందరు దీనిని కూడా విడాకులకి లింకప్ చేస్తున్నారు.
