అక్షరటుడే, కామారెడ్డి: Operation Karregutta | ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్(Greyhounds Conistable Vadla Sridhar) మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు శ్రీధర్ అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వం తరపున పాల్వంచలో జరగనున్నాయి. అంత్యక్రియలకు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(BC Welfare and Transport Minister Ponnam Prabhakar) హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
