అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hero Vishal | తమిళ నటుడు, హీరో విశాల్(Hero Vishal) స్టేజీపై స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండవర్ ఆలయ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్‌జెండర్ల అందాల పోటీ(Transgender beauty Compititions)లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాల్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. అక్కడున్న వారు వెంటనే ప్రథమ చికిత్స అందించడంతో కోలుకున్నారు. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించారు.
Hero Vishal | అభిమానుల్లో ఆందోళన
హీరో విశాల్(Hero Vishal) గత కొంతకాలంగా యాక్టివ్‌గా ఉండడం లేదు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ‘మద గజ రాజా’ సినిమా ప్రమోషన్స్‌లో విశాల్ నీరసంగా కనిపించిన సంగతి తెలిసిందే. ప్రమోషన్(Promotion) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన వణుకుతూ కనిపించారు. మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అప్పుడు అనేక వార్తలు వచ్చాయి. అయితే తీవ్ర స్థాయిలో జ్వరంతో ఆయన ఇబ్బంది పడ్డట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా విశాల్ స్పృహ తప్పి పడిపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆహారం తీసుకోకపోవడంతోనే విశాల్ కళ్లు తిరిగి పడిపోయినట్లుగా తమిళ మీడియా(Tamil Media) పేర్కొంది.