అక్షరటుడే, వెబ్డెస్క్ : Vijay Deverakonda | సినీ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా రోడ్డు ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డాడు.
విజయ్ తన మేనేజర్ మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందే శ్రీకాంత్‌తో కలిసి పుట్టపర్తి వెళ్లారు. హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఉండవెల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నందికొట్కూరు నుంచి పెబ్బేరుకు పశువులను తీసుకొని వెళ్తున్నబొలెరో వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని విజయ దేవరకొండ వాహనం ఢీకొంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. డ్రైవర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన అనంతరం విజయ్ మరో కారులో హైదరాబాద్కు వెళ్లారు.