HomeUncategorizedHero Sri Ram | డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ హీరోను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు.....

Hero Sri Ram | డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ హీరోను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు.. ప‌లు కోణాల్లో విచార‌ణ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hero Sri Ram | కోలీవుడ్ హీరో శ్రీరామ్ డ్ర‌గ్స్ కేసు(Drugs Case)లో అరెస్ట్ కావ‌డం ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌(Film Industry)లో క‌ల‌వరం సృష్టిస్తోంది. ఈ విష‌యం ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల‌లో సంచ‌ల‌నంగా మారింది. మాజీ ఏఐడీఎంకే నేత ప్రసాద్(Former AIADMK leader Prasad) నుండి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. డ్ర‌గ్స్ కేసులో అరెస్టైన వారు ఇచ్చిన స‌మాచారంతో న‌టుడిని చెన్నై పోలీసులు(Chennai Police) ఆయ‌నను అదుపులోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయనను అదుపులోకి తీసుకున్న చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు.. శ్రీరామ్ ను అరెస్ట్ చేసి నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. అక్కడే రెండు గంటల పాటు అనేక కోణాల్లో విచారించారు.

Hero Sri Ram | డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్..

రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి(Rajiv Gandhi Government Hospital)లో న‌టుడికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆయన నుంచి బ్ల‌డ్ శాంపిల్స్‌ను సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం అత‌డిని నుంగంబాక్కం స్టేషన్‌(Nungambakkam Station)కు తరలించారు. పక్కా ఆధారాలు దొరకడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే శ్రీరామ్‌ అరెస్ట్ కోలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇంకెంత మంది పేర్లు బయటికి వస్తాయోనని అందరూ టెన్షన్ పడుతున్నారు. శ్రీరామ్ అస‌లు పేరు శ్రీకాంత్‌ . ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏపీకి చెందిన అత‌డు సినిమాల‌పై ఇష్టంతో చెన్నైకి వెళ్లాడు. త‌న పేరును శ్రీరామ్‌గా మార్చుకున్నాడు. త‌మిళ చిత్రం రోజా కూటంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం తెలుగులో రోజా పూలు పేరుతో విడుద‌లైంది.

‘ఒక‌రికి ఒక‌రు’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర అయ్యారు. తెలుగు, త‌మిళ చిత్రాల్లో హీరోగానే కాకుండా ప‌లువురు స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఒకరికి ఒకరు తదితర చిత్రాలతో తెలుగువారికి కూడా పరిచయమున్న శ్రీరామ్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. ఇటీవల ‘హరికథ’ అనే వెబ్ సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు.