అక్షరటుడే, వెబ్డెస్క్:Hit -3 | టాలీవుడ్ హీరో నాని(Hero Nani) ఆదివారం తిరుమల శ్రీవారి(Tirumala Srivari)ని దర్శించుకున్నారు. నాని హీరోగా ఆయనే స్వయంగా నిర్మిస్తున్న హిట్ –3(Hit-3) సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో నాని నిర్మించిన హిట్, హిట్ –2 భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో హిట్ –3పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల నేపథ్యంలో నానీ నటి శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty)తో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
అలిపిరి(Alipiri) నుంచి మెట్లమార్గంలో ఉదయం తిరుమల చేరుకున్న వారికి టీటీడీ అధికారులు(TTD Offivers) స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు నాని, శ్రీనిధిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా హిట్–3 సినిమాను డెరెక్టర్ శైలేశ్(Director Sailesh) కొలను తెరకెక్కించారు.
1 comment
[…] అడుగుపెట్టిన శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డ సరసన […]
Comments are closed.