ePaper
More
    Homeఅంతర్జాతీయంMiss World contestants | చార్మినార్​ వద్ద నేడు హెరిటేజ్​ వాక్​​.. సందడి చేయనున్న 109...

    Miss World contestants | చార్మినార్​ వద్ద నేడు హెరిటేజ్​ వాక్​​.. సందడి చేయనున్న 109 దేశాల సుందరీమణులు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Miss World contestants : మిస్ వరల్డ్ లో పాల్గొనడానికి హైదరాబాద్​ వచ్చిన 109 దేశాల కంటెస్టెంట్స్ మంగళవారం ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్దకు చేరుకోనున్నారు. ఇక్కడ హెరిటేజ్ వాకింగ్ చేస్తారు. సుమారు నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు 109 దేశాల సుందరీమణులు చేరుకుంటారు. పాతబస్తీలో పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో వీరికి స్వాగతం పలుకుతారు.

    చార్మినార్ వద్ద సుందరీమణులకు సంబంధించి ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహిస్తారు. అనంతరం సమీపంలోని చుడీ బజారుకు చేరుకుంటారు. అక్కడ ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ ఉంటుంది.

    ముజీబ్ బ్యాంగిల్స్హై , దరాబాద్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతిలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కె ఆర్ కాసత్, జాజు పెరల్స్ ఏ హెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే Mujeeb Bangles, Hyderabad Bangles, Kanahayyalal, Motilal Karwa, Gokul Das Jariwala, K R Kasat, Jaju Pearls A H Jariwala, Afzal Mia Karchobe Wale దుకాణాల్లో షాపింగ్ చేస్తారు. గాజులు తయారు చేసే విధానాన్ని వారు స్వయంగా పరిశీలిస్తారు.

    అనంతరం సుప్రసిద్ధ చౌహన్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు. మిస్ వరల్డ్ కంటెస్టంట్లకు మెహేంది వేయడానికి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. నిజామి సంప్రదాయ దుస్తులు ధరించడానికి అవకాశం కల్పించారు. దీనితోపాటు రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే చిత్రాలను ప్రదర్శిస్తారు.

    చౌహన్లా ప్యాలెస్ Chauhanla Palace లో నిజాం హయంలో ఉపయోగించిన ఆయుధాలు, గృహోపకరణ సామగ్రి, నిజాం నవాబులు Nizam Nawabs వినియోగించిన వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతి సంప్రదాయాల (Old City culture , traditions) ను తెలియజేసే ఫొటో ప్రదర్శన photo exhibitions లు ఉంటాయి. మిస్ వరల్డ్ కంటెస్టర్లు వాటిని తిలకిస్తారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...