అక్షరటుడే, కామారెడ్డి: Panchayat Elections | జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి చలిలో సైతం ప్రజలు పోలింగ్ కేంద్రాల (polling stations) వద్ద ఓటేసేందుకు క్యూ కట్టారు.
Panchayat Elections | 21.49 శాతం పోలింగ్ నమోదు..
జిల్లాలోని బాన్సువాడ డివిజన్ పరిధిలో మొత్తం 1,90,296 మంది ఓటర్లు ఉండగా ఉదయం 9 గంటల వరకు 40,890 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 8 మండలాల్లో 21.49 శాతం పోలింగ్ నమోదు కాగా.. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలంలో 19.90 శాతం, బిచ్కుంద మండలంలో 27.70 శాతం, బీర్కూర్ మండలంలో 18.23 శాతం, డొంగ్లీ మండలంలో 25.43 శాతం, జుక్కల్ మండలంలో 21.07 శాతం, మద్నూర్ మండలంలో 14.70 శాతం, నస్రుల్లాబాద్ మండలంలో 21.90 శాతం, పెద్దకొడప్ గల్ మండలంలో 27.15 శాతం పోలింగ్ నమోదు కాగా ఆత్యల్పంగా మద్నూర్ మండలంలో 14.70శాతం పోలింగ్ నమోదైంది.