అక్షరటుడే, వెబ్డెస్క్: Studds Accessories Limited IPO | భారతదేశంలో ప్రముఖ హెల్మెట్‌ల తయారీ సంస్థ అయిన స్టడ్స్ యాక్సెసరీస్ లిమిటెడ్(Studds Accessories Limited IPO)ను 1973లో స్థాపించారు.
స్టడ్స్, ఎస్‌ఎంకే(SMK) ప్రధాన బ్రాండ్ల పేరుతో పలు ఉత్పత్తులను విక్రయిస్తుంటుంది. ద్విచక్ర వాహన హెల్మెట్లతోపాటు ద్విచక్ర వాహన సామగ్రి, గ్లౌజెస్, రెయిన్ సూట్లు, రైడిరగ్ జాకెట్లు ఐవేర్ తయారు చేస్తుంది. స్టడ్స్, ఎస్‌ఎంకే బ్రాండ్‌ల పేరుతో హెల్మెట్‌లను తయారు చేస్తుండగా.. ఇతర ఉపకరణాలను స్టడ్స్ బ్రాండ్ పేరుతో తయారు చేస్తుంది. ఇది భారత్(Bharat)లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హెల్మెట్‌ల తయారీలో అగ్రగామి సంస్థగా నిలుస్తోంది.
Studds Accessories Limited IPO | 70 దేశాలకు ఎగుమతి..
స్టడ్స్ యాక్సెసరీస్ లిమిటెడ్ తన ఉత్పత్తులను భారతదేశం అంతటా పంపిణీ చేస్తుంది. అమెరికా, ఆసియా(Asia), యూరప్ మరియు ఇతర ప్రాంతాల మార్కెట్‌లతో సహా 70 దేశాలకు ఎగుమతి చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్(US)లో డేటోనా బ్రాండ్ కింద ఉత్పత్తులను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 71 లక్షలకుపైగా హెల్మెట్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది.
Studds Accessories Limited IPO | ఐపీవో వివరాలు..
ఐపీవో(IPO) వివరాలను కంపెనీ పూర్తిగా వెల్లడిరచలేదు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈనెల 30న సబ్‌స్క్రిప్షన్(Subscription) ప్రారంభం కానుంది. నవంబర్ 3 వరకు విండో తెరిచి ఉంటుంది. 4న అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడవుతుంది. 7న కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా రూ. 5 ముఖ విలువ కలిగిన 77.86 లక్షల షేర్లను వియ్రించనున్నట్లు తెలుస్తోంది. ఐపీవోకు సంబంధించిన మిగతా వివరాలను కంపెనీ ప్రకటించాల్సి ఉంది.
