అక్షరటుడే, వెబ్‌డెస్క్:Karnataka | టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), ఎయిర్‌బస్ భాగస్వామ్యంలో నెలకొల్పనున్న హెలికాప్టర్ల ఉత్పత్తి ప్లాంట్(Helicopter production plant)ను కర్ణాటక దక్కించుకుంది.
మేకిన్ ఇండియాలో భాగంగా రెండు సంస్థలు కలిసి ఇండియాలోనే H125 హెలికాప్టర్ల ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ప్లాంట్‌ను స్థాపించడానికి నాలుగు రాష్ట్రాలను పరిశీలించారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు కర్ణాటక(Karnataka) ఆ అవకాశాన్ని దక్కించుకుంది. అన్నీ అనుకూలంగా ఉండడంతో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఎయిర్‌బస్ సంస్థలు కర్ణాటక వైపే మొగ్గు చూపాయి.
Karnataka | ఏడాదికి 10 హెలికాప్టర్లు..
దేశంలో H125 హెలికాప్టర్లను తయారు చేయడానికి ఎయిర్‌బస్, TASL మధ్య 2024 జనవరిలో ఒప్పందం కుదరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(French President Emmanuel Macron) మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందం ఖరారైంది. ఇండియాలో ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ప్రైవేట్ రంగంలో సివిల్ హెలికాప్టర్‌కు మొదటిది అవుతుంది. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం.. సంవత్సరానికి 10 H125లను ఉత్పత్తి చేయనుంది. ఆర్డర్లు పెరిగేకొద్దీ ఉత్పత్తి పెంచే అవకాశముంది. రాబోయే 20 సంవత్సరాలలో దేశంలో, దక్షిణాసియాలో H125 తరగతికి చెందిన 500 తేలికపాటి హెలికాప్టర్లకు డిమాండ్ ఉంటుందని ఎయిర్‌బస్ అంచనా వేసింది.
Karnataka | వాణిజ్య రవాణాకు అనువు..
2.8 టన్నుల బరువుండె H125 హెలికాప్టర్ ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు. గరిష్టంగా 23,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. 630 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. వాణిజ్య రవాణా, చట్ట అమలు, అత్యవసర వైద్య సేవలు, విపత్తు నిర్వహణ, ఆఫ్‌షోర్ పరిశ్రమ మరియు అగ్నిమాపక దళాలకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ హెలికాప్టర్లు ప్రస్తుతం ఫ్రాన్స్, యుఎస్, బ్రెజిల్‌లలో మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఇండియన్ ఎఫ్‌ఎఎల్(Indian FAL)లో టీఏఎస్‌ఎల్(TASL).. ప్రధాన భాగాల అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్‌లు, ఫ్లైట్ కంట్రోల్‌లు, హైడ్రాలిక్ సర్క్యూట్‌లు, ఇంధన వ్యవస్థ, ఇంజిన్ల అసెంబ్లింగ్ చేస్తుంది. హెచ్125 ఇంజిన్, గేర్‌బాక్స్ ఫ్రాన్స్ నుంచి వస్తాయి. జర్మనీ నుంచి ప్రధాన ఎయిర్‌ఫ్రేమ్, స్పెయిన్ నుంచి టెయిల్ బూమ్ వస్తాయి.
Karnataka | ఇది రెండోది..
ఎయిర్‌బస్ భారతదేశంలో ఏర్పాటు చేసిన రెండవ ఎఫ్ఏల్ ఇది. భారత వైమానిక దళం (IAF) కోసం 56 C-295 విమానాలను అందించడానికి TASLతో కలిసి ₹21,935 కోట్ల ప్రాజెక్టును చేపట్టింది. 2021 సెప్టెంబర్ లో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక రంగంలో స్వావలంబనను బలోపేతం చేయడానికి ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో ఒప్పందంపై సంతకం చేసింది. యూరోపియన్ ఎయిర్‌క్రాఫ్ట్ (European aircraft)తయారీ సంస్థ 16 విమానాలను ఫ్లైఅవే స్థితిలో డెలివరీ చేస్తోంది. మిగిలినవి గుజరాత్‌లోని వడోదరలోని టాటా సౌకర్యంలో అసెంబుల్ చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ప్రధాని మోదీ, స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్ సంయుక్తంగా వడోదరలో టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్(Tata Aircraft Complex)ను ప్రారంభించారు. ఎయిర్‌బస్ ఇప్పటికే అనేక C-295లను IAFకి డెలివరీ చేసింది. చివరిది ఈ ఆగస్టు నాటికి ఫ్లీట్‌లో చేరుతుందని భావిస్తున్నారు. 2026 సెప్టెంబర్‌లో వడోదర(Vadodara)లో మొదటి C-295 విమానం తయారవుతుందని భావిస్తున్నారు. మిగిలిన 39 ఆగస్టు 2031 నాటికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరుతాయని అంచనా వేస్తున్నారు.
Karnataka | చేతులు కలిపిన టాటా, ఎయిర్‌బస్..
భారతదేశంలోని ఏరోస్పేస్, డిఫెన్స్ సొల్యూషన్స్ కోసం అగ్రశ్రేణి ప్రైవేట్ రంగ సంస్థ అయిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), భారతదేశంలో H125 ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL)ను స్థాపించడానికి ఎయిర్‌బస్ హెలికాప్టర్లతో చేతులు కలిపింది. ఈ ఒప్పందంపై ఫార్న్‌బరో ఇంటర్నేషనల్ ఎయిర్‌షో 2024లో సంతకం చేశారు.