HomeUncategorizedKedarnath | రోడ్డుపై ల్యాండ్​ అయిన హెలికాప్టర్​.. ఎందుకో తెలుసా..!

Kedarnath | రోడ్డుపై ల్యాండ్​ అయిన హెలికాప్టర్​.. ఎందుకో తెలుసా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Kedarnath | ఓ హెలికాప్టర్ (Helicopter landed on road)​ నడిరోడ్డుపై ల్యాండ్​ అవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand)​ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో రుద్రప్రయాగ జిల్లాలోని గుప్త్కాషిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ వెనుక భాగం అక్కడ నిలిపి ఉన్న ఓ కారు మీద పడింది. దీంతో కారు ధ్వంసం అయింది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న వారు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పైలట్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.

క్రిస్టల్​ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌(Crystal Aviation Private Limited)కు చెందిన హెలికాప్టర్ సిర్సి నుండి ప్రయాణికులతో వెళ్తున్నప్పుడు హెలిప్యాడ్‌కు బదులుగా రోడ్డుపై ముందుజాగ్రత్తగా ల్యాండ్ అయిందని దాని సీఈవో తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Must Read
Related News