HomeUncategorizedHelicopter crash | చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురి దుర్మరణం

Helicopter crash | చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురి దుర్మరణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: helicopter crash | అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం ఎంత మందిని పొట్ట‌న బెట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ ప్ర‌మాదం నుండి ఇంకా తేరుకోక‌ముందే చార్‌ధామ్ యాత్రలో ప్రమాదం చోటు చేసుకోవడం అందరినీ క‌లిచివేస్తుంది. ఉత్తరాఖండ్​లోని గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్​లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌‌ (Uttarakhand)లో జ‌రిగిన హెలికాఫ్టర్ ప్ర‌మాదానికి ప్ర‌తికూల వాతావరణమే కారణంగా తెలుస్తోంది. డెహ్రాడూన్‌ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Helicopter crash | మ‌రో ప్ర‌మాదం..

రుద్రప్రయాగ్ జిల్లాలోని గుప్త్‌కాశి నుంచి కేదార్‌నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స‌మాచారం. గుప్త్ కాశీ నుంచి తెల్లవారుజామున 5.17 గంటలకు హెలికాప్టర్‌ Helicopter ప్రయాణీకులను ఎక్కించుకొని కేదార్‌నాథ్‌కు బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ దారితప్పి కూలినట్లు తెలుస్తుంది. ఇది అర్యన్ ఏవియేషన్​కు సంబంధించిన హెలికాప్టర్​గా గుర్తించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్​లో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మరొకరు గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ(Uttarakhand CM Pushkar Singh Dhami) స్పందించారు. రుద్రప్రయాగ(Rudraprayag) జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి చాలా విచారకరమైన వార్తలు అందాయి. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయ, రెస్క్యూ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. ప్రయాణీకులందరి భద్రత కోసం నేను బాబా కేదార్ ను ప్రార్థిస్తున్నాను అని ట్విటర్ Twitterవేదికగా పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ గౌరీకుండ్‌ అడవిలో కూలిపోయింది. ఈ ప్ర‌మాదం ప‌ట్ల పలువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా సంతాపం తెలియ‌జేస్తున్నారు.