అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | యూఎస్, జపాన్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం (Trade deal) కుదరడంతో గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. మన మార్కెట్‌లో హెవీవెయిట్ కంపెనీలయిన హెచ్‌డీఎఫ్‌సీ(HDFC), ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్‌టెల్, రిలయన్స్ స్టాక్స్ ప్రధాన సూచీలను ముందుకు నడిపించాయి.
ఉదయం సెన్సెక్స్ 265 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 172 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో గరిష్టంగా 507 పాయింట్లు పెరిగింది. 79 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. అక్కడి నుంచి 54 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 148 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 539 పాయింట్ల లాభంతో 82,726 వద్ద, నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 25,219 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,005 కంపెనీలు లాభపడగా 2,025 స్టాక్స్ నష్టపోయాయి. 168 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 149 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 48 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 4 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో దూకుడు..
బ్యాంకింగ్, ఫైనాన్షియల్(Financial), టెలికాం స్టాక్స్‌లో దూకుడుతో బుధవారం సూచీలు పరుగులు తీశాయి. బీఎస్‌ఈలో టెలికాం ఇండెక్స్(Telecom index) 1.14 శాతం పెరగ్గా.. ఆటో సూచీ 0.86 శాతం, బ్యాంకెక్స్ 0.71 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్ ఇండెక్స్‌లు 0.70 శాతం, ఎనర్జీ 0.65 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.61 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.57 శాతం, మెటల్ ఇండెక్స్ 0.46 శాతం పెరిగాయి. రియాలిటీ(Realty) ఇండెక్స్ 2.60 శాతం క్షీణించగా.. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.46 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.31 శాతం పడిపోయాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.24 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.64 శాతం నష్టపోయాయి.
Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో 8 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్ 2.51 శాతం, ఎయిర్‌టెల్ 1.94 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.69 శాతం, మారుతి 1.15 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.20 శాతం లాభపడ్డాయి.
Top Losers:హెచ్‌యూఎల్ 0.97 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.71 శాతం, బీఈఎల్ 0.55 శాతం, ఐటీసీ 0.28 శాతం, టైటాన్ 0.16 శాతం నష్గపోయాయి.