అక్షరటుడే, వెబ్డెస్క్: Heavy Rain Alert | తెలంగాణలో రానున్న రెండు మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (very heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. వీటిలో ఆదిలాబాద్, హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నల్గొండ, యాదాద్రి, జనగాం, మహబూబ్నగర్, రంగారెడ్డి ఉన్నాయి. కాగా.. మిగతా అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Heavy Rain Alert | హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లోనూ..
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లోనూ రానున్న రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, గాజులరామారం, నిజాంపేట్, లింగంపల్లి, మియాపూర్, బాచుపల్లి, ఎల్‌బీ నగర్, సరూర్‌నగర్, హఫీజ్‌పేట్, హయత్‌నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, కాప్రా, ఈసీఐఎల్, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌గుంపేట తదితర ప్రాంతాల్లో వాన కురుస్తుందని తెలిపింది.
Heavy Rain Alert | పలు ప్రాంతాల్లో వర్షం
నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ఉప్పల్, తార్నాకా, సీతాఫల్మండి, చిలకలగూడ, అల్వాల్, తిరుమల్గిరి తదితర ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా.. హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు.