అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Temperature | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం పది దాటిందంటే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు Temperature మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ Meteorological Department హెచ్చరించింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో North Telangana రికార్డు స్థాయిలో 45 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదు కావొచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది. ఉక్కపోతతో పాటు, దక్షిణ తెలంగాణలోని South Telangana పలు ప్రాంతాల్లో చిరు జల్లులు rains కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.