Homeజిల్లాలుకామారెడ్డిHeavy rain | దంచికొట్టిన వాన.. తడిసి ముద్దయిన గ్రామాలు

Heavy rain | దంచికొట్టిన వాన.. తడిసి ముద్దయిన గ్రామాలు

- Advertisement -

అక్షరటుడే నిజాంసాగర్/ఎల్లారెడ్డి: Heavy rain | ఎల్లారెడ్డి, జుక్కల్​ నియోజకవర్గాల్లో (YellaReddy and Jukkal constituencies) బుధవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. సుమారు నాలుగు గంటల పాటు వాన కురిసింది. దీంతో రహదారులపై వర్షం నీరు వరదలా పారింది. వర్షం కారణంగా మహమ్మద్​నగర్​ మండలంలో విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. లింగంపేట మండల కేంద్రంతో గంటపాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.