ePaper
More
    HomeతెలంగాణWeather Updates | రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు

    Weather Updates | రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపనున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officers) తెలిపారు.

    అల్పపీడన ప్రభావంతో మొన్నటి వరకు భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన విషయం తెలిసిందే. అయితే వారం రోజులుగా వానలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ మంగళవారం నుంచి రాష్ట్రంలోని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు వానలు దంచికొడతాయని పేర్కొన్నారు.

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    తెలంగాణ(Telangana)లోని పలు ప్రాంతాల్లో సోమవారం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం పూట కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్(Hyderabad)​లో వాతావరణం పొడిగా ఉంటుంది. తేలకపాటి వానలు పడొచ్చు. రేపటి నుంచి నగరంలో సైతం భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా వినాయక చవితి రోజు సైతం భారీ వర్ష సూచన ఉండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్​ పనులు చేపట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    Weather Updates | ఉత్తరాదిలో బీభత్సం

    ఉత్తర భారత్​లోని (North India) పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజస్థాన్​, ఉత్తరాఖండ్​, హిమాచల్​ ప్రదేశ్​, జమ్మూ కశ్మీర్​లో భారీ వానలు పడుతున్నాయి. కుండపోత వానలు, ఆకస్మిక వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 48 గంటలు సైతం జమ్మూ కశ్మీర్​, హిమాచల్ ప్రదేశ్​లో అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు హెచ్చించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    Latest articles

    Parineeti Chopra | గుడ్ న్యూస్ చెప్పిన ప‌రిణితీ చోప్రా.. బేబి ఆన్ ది వే అంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parineeti Chopra | బాలీవుడ్ బెస్ట్‌ సెలబ్రిటీ జంటల పేర్లు చెప్పుకుంటే అందులో తప్పకుండా...

    Cardiac Arrest | సిక్స‌ర్ కొట్టాక గుండెపోటుతో కుప్ప‌కూలిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cardiac Arrest | ఇటీవల ఆటలు ఆడుతూ, వ్యాయామాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయే ఘటనలు...

    ASHA Workers | చావుకు వెళ్తే మృతదేహంతో ఫొటో దిగి పెట్టాలట.. కలెక్టరేట్​ ఎదుట ఆశాల ధర్నా

    అక్షరటుడే, కామారెడ్డి: ASHA Workers | అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు చనిపోయారని...

    Nagar Kurnool | రాంగ్​నంబర్​లో కనెక్టయి పెళ్లి.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagar Kurnool | వారిద్దరు రాంగ్​ నంబర్​లో కనెక్ట్​ అయ్యారు. అనంతరం ప్రేమించి వివాహం...

    More like this