అక్షరటుడే, వెబ్డెస్క్:Weather Updates | రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మే నెలలోనే వానాకాలం ప్రారంభమైనట్లు వర్షాలు పడుతున్నాయి.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ (Telangana) వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. తాజాగా ఉత్తర తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Weather Updates | చురుగ్గా నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఎనిమిది రోజుల ముందుగానే కేరళా తీరాన్ని తాకిన రుతుపవనాలు కేరళ, గోవా, కర్నాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ వరకు విస్తరించాయి. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోకి ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ 2 తర్వాత రుతుపవనాల వేగం తగ్గనున్నట్లు అధికారులు తెలిపారు.
Weather Updates | ఆ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలెర్ట్
తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ తమిళనాడులోని 11 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్(Orange Alert) జారీ చేశారు. కోయంబత్తూర్, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం పడటంతో రాకపోకలు నిలిపివేశారు. దీంతో పర్యాటకుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. కేరళలో సైతం వర్షాలతో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్(Red Alert), మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో భారీ వర్షాలు పడుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపడున్నారు.