Heavy Rains Alert | రానున్న 72 గంటల్లో అతి భారీ వర్షాలు..
Heavy Rains Alert | రానున్న 72 గంటల్లో అతి భారీ వర్షాలు..

అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : గ్రేటర్​ హైద‌రాబాద్‌ (Greater Hyderabad) తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ సచివాల‌యం(Telangana Secretariat) లో సోమవారం (ఆగస్టు 4) రాత్రి ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

భారీ వర్షాలు(heavy rains) కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ(GHMC)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరద నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారుల‌కు సూచించారు.

రానున్న రెండు, మూడు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.