అక్షరటుడే, వెబ్‌డెస్క్: Heavy rains in North India : ఉత్తర భారత్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లో వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
జమ్మూ- పఠాన్‌కోట్ జాతీయ రహదారి (Jammu-Pathankot National Highway) పై వంతెన Bridge ధ్వంసం అయింది. ఇక్కడి సహర్ ఖడ్ నది (Sahar Khad river) కి వరద పోటెత్తడంతో ప్రధాన వంతెన కుంగిపోయింది.
నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గత 24 గంటల్లో జమ్మూలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Heavy rains in North India : నీటమునిగిన ఐఐఐఎం..
ఎడతెరపని వర్షాలతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ హాస్టల్లోకి భారీగా వరద చేరింది. దీంతో ఇక్కడి 45 మంది విద్యార్థులు వరదలో చిక్కుకుపోయారు.
వసతి గృహం గ్రౌండ్ ఫ్లోర్ వరదలో మునిగిపోయింది. పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది IIIM వద్దకు చేరుకున్నారు. ఎంతో శ్రమించి బోట్ల సాయంతో విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు.
Heavy rains in North India : ఇప్పటి వరకు 298 మంది బలి!
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో మరణ మృదంగం కొనసాగుతోంది. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి (జూన్ 20న) నుంచి ఇప్పటివరకు 298 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆదివారం (ఆగస్టు 24) వెల్లడించింది.
కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, వర్షాలు, ఇళ్లు కూలిపోవడం తదితర వాటి వల్ల 152 మంది మరణించగా.. రోడ్డు ప్రమాదాల్లో 146 మంది మరణించారు.
రాజస్థాన్లో 50 సెం.మీటర్ల వర్షపాతం
రాజస్థాన్ (Rajasthan) లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 50 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
కుండపోత (Heavy rains) వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.