అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rains| జమ్మూకశ్మీర్లో గురువారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి (heavy rains in kashmir). దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. రాంబన్ జిల్లాలోని (ramban district) త్రిశూల్ మోర్ వద్ద కొండచరియలు పడడంతో జమ్మూ-శ్రీనగర్ (jammu – srinagar) జాతీయ రహదారి మూసివేశారు. రోడ్డుపై భారీగా బురద పేరుకుపోయింది. బురదలో ట్రక్కు చిక్కుకోగా అందులోని డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. రాంబన్ ట్రాఫిక్ ఎస్ఎస్పీ రాజా ఆదిల్ హమీద్ మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా ఎన్ హెచ్ 44 మూసివేశామని తెలిపారు. రోడ్డు పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని వివరించారు. బురద తొలగించాక వాహనాలను అనుమతిస్తామన్నారు. వాహనాదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
