More
    HomeతెలంగాణHyderabad | హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు.. నాలాలో ముగ్గురు గ‌ల్లంతు.. కొన‌సాగుతున్న గాలింపు

    Hyderabad | హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు.. నాలాలో ముగ్గురు గ‌ల్లంతు.. కొన‌సాగుతున్న గాలింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్‌ అత‌లాకుత‌ల‌మైంది. గంట వ్య‌వ‌ధిలోనే 12 సెంటిమీట‌ర్ల వ‌ర్షం కురియ‌డంతో న‌గ‌రం స్తంభించి పోయింది. ఆదివారం రాత్రి నుంచి కురిసిన భారీ వ‌ర్షాల‌తో(Heavy Rains) లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. రోడ్లపైకి నీళ్లు రావ‌డంతో రాక‌పోక‌ల‌కు తీవ్ర ప్ర‌భావంచూపింది.

    మ‌రోవైపు, నాలాలు ఉప్పొంగ‌డంతో వేర్వేరు చోట్ల ముగ్గురు గ‌ల్లంత‌య్యారు. ముషీరాబాద్, నాంపల్లి, పార్సిగుట్టతో సహా అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు(Traffic Police), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు(Municipal Corporation Team) రంగంలోకి దిగాయి.

    Hyderabad | ముగ్గురు గ‌ల్లంతు..

    ఆదివారం సాయంత్రం నుంచి భాగ్యనగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. ముషీరాబాద్, షేక్‌పేట్, మణికొండ, గచ్చిబౌలి, కాప్రా, మల్కాజ్‌గిరి, ఉప్పల్, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, బాలానగర్, వనస్థలిపురం లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ఆసిఫ్ నగర్‌లోని అఫ్జల్‌సాగర్‌ నాలాలో పడి మామ, అల్లుడు కొట్టుకుపోయారు. నాలాను దాటే క్రమంలో ఇద్దరూ కొట్టుకుపోయారు. ముషీరాబాద్‌లోని వినోదానగర్ నాలాలో పడి ఒక యువకుడు గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి నుంచి వారి కోసం గాలిస్తున్నా ఇప్ప‌టివ‌ర‌కు వారి ఆచూకీ దొర‌క‌లేదు. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో జాప్యం స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పార్సిగుట్ట బస్ స్టాప్ సమీపంలో డ్రెయిన్ గోడ కూలిపోవడంతో సన్నీ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. అతని స్కూటర్ పార్సిగుట్ట చర్చి సమీపంలో దొరికినా అతని జాడ ఇంకా ల‌భ్యం కాలేదు.

    Hyderabad | ప‌లుచోట్ల భారీ వ‌ర్షాలు..

    తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు కురిశాయి. అత్య‌ధికంగా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో 245.5 మి.మీ. వ‌ర్ష‌పాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని అబ్దుల్లాపూర్మెట్-థాటియనారాం ల‌లో 128 మి.మీ, ముషీరాబాద్ లో 114.5 మి.మీ. వ‌ర్షం కురిసింది. హైద‌రాబాద్‌(Hyderabad)లోని ప‌లు ప్రాంతాల్లో గంట వ్య‌వ‌ధిలోనే 12 సెం.మీ.ల‌కు పైగా వ‌ర్షం కురియ‌డంతో లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాలాలు ఉప్పొంగి స‌మీపంలోని ఇళ్ల‌లోకి నీళ్లు వ‌చ్చాయి.

    Hyderabad | స‌హాయక చ‌ర్య‌లు ప్రారంభం

    భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్‌ఎంసీ(GHMC), హైడ్రా(Hydraa), విపత్తు ప్రతిస్పందన దళం రంగంలోకి దిగింది. గ‌ల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. సమీపంలోని మ్యాన్‌హోల్స్, డ్రెయిన్‌లను తనిఖీ చేస్తున్నారు. మ‌రోవైపు, బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నానని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. వరద నీటిని తొల‌గించ‌డానికి, ట్రాఫిక్‌ను మళ్లించడానికి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని చెప్పారు. అయితే, అనేక పరిసరాల్లో చాలా కాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను ప‌ట్టించుకోక పోవ‌డం వ‌ల్లే ఇళ్ల‌లోకి నీళ్లు వ‌చ్చాయ‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. షాపులు, ఇళ్ల‌లోకి నీళ్లు వ‌చ్చి వ‌స్తువుల‌న్నీ త‌డిసిపోయాయ‌ని మండిప‌డ్డారు.

    Hyderabad | భారీ వ‌ర్ష సూచ‌న‌..

    ఇప్పటికే భారీ వ‌ర్షాల‌తో స్తంభించిన హైద‌రాబాద్ న‌గరంలో మ‌రిన్ని వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ(Meteorological Department) తెలిపింది. భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌ల‌మ‌య‌మైన లోత‌ట్టు ప్రాంతాలు మ‌రింత ఆందోళ‌న చెందుతున్నారు. హైదరాబాద్‌లో పునరావృతమయ్యే పట్టణ వరద సమస్యకు తక్షణ, శాశ్వత చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

    More like this

    Anganwadi Teachers | అంగన్​వాడీ కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

    అక్షరటుడే, భీమ్​గల్: Anganwadi Teachers | నియోజకవర్గంలోని ఆయా మండల పరిధిలో అంగన్​వాడీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు....

    Hyderabad Floods | మంచం కోసం వెళ్లి నాలాలో కొట్టుకుపోయారు : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Floods | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించిన విషయం...

    RRB Notification | నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్‌ఆర్‌బీనుంచి జాబ్‌ నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RRB Notification | భారత రైల్వేలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి రైల్వే రిక్రూట్‌మెంట్‌...