HomeUncategorizedRains in Delhi | ఢిల్లీలో భారీ వర్షాలు.. నలుగురి మృతి

Rains in Delhi | ఢిల్లీలో భారీ వర్షాలు.. నలుగురి మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rains in Delhi | దేశ రాజధాని ఢిల్లీ Delhiలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు భారీ గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. హోర్డింగ్​లు నేలకూలాయి. ద్వారకలో ఇంటిపై చెట్టు కూలి తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వాతావరణ శాఖ Meteorological Department అధికారులు వర్షాల నేపథ్యంలో ఢిల్లీలో రెడ్​ అలెర్ట్ red alert​ ప్రకటించారు. గాలివానతో 100 విమనాలు flights ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమానాలను దారి మళ్లించారు.