HomeUncategorizedRains Today | నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

Rains Today | నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Rains Today | అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే మూడు-నాలుగు రోజుల్లో కేరళ(Kerala)లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశ‌ముందంటూ రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా ఢిల్లీలో కూడా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కార్యాలయం తెలిపింది.

Kerala Rains | కేరళలో పాఠశాలలు మూత‌

కేరళలోని పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, కోజికోడ్ సహా ఎనిమిది జిల్లాలకు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావరణ కార్యాలయం (Meteorological Office) రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కేరళ వ్యాప్తంగా శుక్ర‌వారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి.

Kerala Rains | ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్

ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు. మే 31 వరకు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్ (NCAP), యానాం, దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్ (SCAP), రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.