ePaper
More
    HomeజాతీయంHeavy Rains | భారీ వర్షాలు.. కూలిన ఐదు అంతస్తుల బిల్డింగ్​

    Heavy Rains | భారీ వర్షాలు.. కూలిన ఐదు అంతస్తుల బిల్డింగ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Heavy Rains | ఉత్తరాదిలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్(Uttarakhand)​, హిమాచ​ల్​ ప్రదేశ్​(Himachal Pradesh)లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరదల దాటికి ఇప్పటికే ఉత్తరాఖండ్​లో పలువరు గల్లంతయ్యారు. తాజాగా హిమాచల్​ప్రదేశ్​లోని ఓ ఐదు అంతస్తుల భవనం వరదల దాటికి పేకమేడలా కూలిపోయింది.

    Heavy Rains | తప్పిన ప్రమాదం

    ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లా(Simla)లో వర్షాలతో సోమవారం ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైర​ల్​ అవుతోంది. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో ఆ భవనంలోని వారు ఖాళీ చేయించారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

    READ ALSO  Liquor Scam | లిక్కర్​ స్కామ్​లో మాజీ సీఎం కుమారుడి అరెస్ట్​

    Heavy Rains | చార్​ధామ్​ యాత్ర భక్తుల ఇబ్బందులు

    ఉత్తరాఖండ్​లో చార్​ధామ్​ యాత్ర(Chardham Yatra)కు వెళ్లిన భక్తులు వర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం భారీ వానలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 24 గంటల పాటు యాత్రను అధికారులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే రహదారిని పునరుద్ధరించిన అధికారులు సోమవారం యాత్రను పున: ప్రారంభించారు. కానీ నిత్యం భారీ వర్షాలు పడుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఉత్తరాఖండ్​, హిమాచల్​ ప్రదేశ్​లోని పలు జిల్లాలకు రెడ్​ అలర్ట్(Red Alert)​ జారీ చేశారు.

    Latest articles

    Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(global markets) పాజిటివ్‌గా ఉన్నా మన మార్కెట్లు మాత్రం...

    Thailand AIR Strikes | మరో యుద్ధం తప్పదా.. కంబోడియాపై థాయిలాండ్​ వైమానిక దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thailand AIR Strikes | కంబోడియాలోని సైనిక స్థావరాలపై థాయిలాండ్​ గురువారం వైమానిక దాడులకు దిగింది....

    MLC Kavitha | అన్న‌య్య నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. క‌విత పోస్ట్ వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)  పుట్టిన...

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    More like this