HomeతెలంగాణHeavy Rains | నేడు తీరం దాట‌నున్న వాయుగుండం.. ఏపీ, తెలంగాణ‌లో భారీ వర్షాలు

Heavy Rains | నేడు తీరం దాట‌నున్న వాయుగుండం.. ఏపీ, తెలంగాణ‌లో భారీ వర్షాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Heavy Rains | ఈ సారి రుతుప‌వ‌నాలు చాలా స్పీడ్‌గా ఉన్నాయి. ముందుగానే మే 24న కేరళకు Kerala చేరుకున్నాయి. సాధారణం కంటే రెండు వారాల ముందుగానే అంటే మే 26న ముంబై(Mumbai) నగరానికి చేరుకున్నాయి. తద్వారా 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాయి.

కర్ణాటక, గోవా ,మధ్య మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు కూడా కాలానుగుణ వర్షాలు సాధారణం కంటే వేగంగా కురిశాయి. రుతుపవనాలకు అనుకూలమైన ప్రధాన అంశం ఎల్ నినో లేకపోవడం. ఇది ఉన్న సంవత్సరాలలో దాదాపు 60% బలహీనమైన రుతుపవన వర్షపాతంతో ముడిపడి ఉంటుంది.

Heavy Rains | భారీ వ‌ర్షాలు..

మ‌రోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం భువనేశ్వర్‌కి దగ్గర్లో ఉంది. క్రమంగా.. బెంగాల్ వైపు కదులుతోంది. ఇవాళ సాయంత్రానికి అది కోల్‌కతాకి దగ్గర్లోని హైదా దగ్గర తీరం దాటే పరిస్థితి ఉంది. దీని వేగం గంటకు 50 కిలోమీటర్లుగా ఉంది.

ఈ క్రమంలో సాయంత్రం నుంచి ఏపీ, తెలంగాణ(Telangana)కి భారీ వర్ష సూచన ఉంది. అది కోల్‌కతా దగ్గర తీరం దాటినా.. దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై Telugu States కూడా ఉండే అవ‌కాశం ఉంది. తీరం దాటాక బలహీన పడుతుందో లేక మరింత బలపడుతుందో చెప్పలేని పరిస్థితి. భారత వాతావరణ శాఖ (India Meteorological Department) ప్రకారం.. నేటి (గురువారం) నుంచి మే 31 వరకూ ఏపీ(Andhra Pradesh), తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

Heavy Rains | వాతావరణ శాఖ హెచ్చరికలు

29, 30 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో Telangana 29, 30 తేదీల్లో అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయి అని IMD చెప్పింది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని పేర్కొంది. అలాగే ఇవాళ రాయలసీమ, యానాం, కోస్తాంధ్రలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఒక్కోసారి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని IMD అంచనా వేసింది. ఇవాళ ఏపీకి పిడుగుల హెచ్చరిక కూడా జారీ చేసింది. భారీవర్షాలు నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.