అక్షరటుడే, వెబ్డెస్క్: Roads Damage | రాష్ట్రంలో భారీ వర్షాలతో (Heavy rains) తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. కుండపోత వాన పడడంతో వరద నీరు (Flood waters) ముంచెత్తింది. వాగులు ఉధృతంగా పారాయి. చెరువులు నిండి అలుగు పారాయి. వరద ఉధృతికి చాలా గ్రామాల్లో రోడ్లు, వంతెనలు (Roads and bridges) కొట్టుకుపోయాయి.
Roads Damage | నిలిచిన రాకపోకలు
వరదలతో రోడ్లు కొట్టుకుపోవడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,039 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులకు సమాచారం అందింది. 794 ప్రాంతాల్లో రోడ్లు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. 31 చోట్ల రోడ్లు తెగిపోయాయి. 356 కల్వర్టులు, కాజ్‌వేలు ధ్వంసం అయ్యాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే పలు గ్రామాలకు ఇంకా రాకపోకలు సాధ్యం కావడం లేదు.
Roads Damage | రూ.1,157 కోట్లు అవసరం..
రాష్ట్రంలో మొత్తం 206 చోట్ల సిడీ వర్క్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ధ్వంసమైన రోడ్ల (damaged roads) తాత్కాలిక మరమ్మతులకు రూ. 53.76 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి రూ.1,157.46 కోట్లు కావాలని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. పలు గ్రామాల్లో ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.