8
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Heavy Rain | అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా విరుచుకుపడిన గాలివానతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.
ఎల్లారెడ్డి మండలంలో భారీ వర్షం కురిసింది. కోతకు వచ్చిన పంటలు నేలవాలాయి. జంగంపల్లి కుర్డు, లక్ష్మాపూర్, రాంపూర్, కొట్టాల్ ప్రాంతంలోని రైతులు (Farmers) ఆయా ప్రాంతాలలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. భారీ వర్షం (heavy rain) రావడంతో వరదకు వడ్లు కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు వ్యయ ప్రయాసలు పడుతున్నారు. పంటలు ఇంటికి వచ్చే తరుణంలో తడిసి రంగు మారటంతో పాటు ముక్కిన వాసన వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.