అక్షరటుడే, ఎల్లారెడ్డి/గాంధారి: Heavy Rain | ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి తండాలో (Timmareddy thanda) భారీ వర్షానికి పలు ఇళ్లలో వరద నీరు చేరింది. సదాశివనగర్ (Sadashivnagar) మండల కేంద్రంలో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ (HP Gas Agency) వద్ద ఫ్లెక్సీ గాలి దుమారానికి ఎగిసిపడి విద్యుత్ తీగలపై పడింది . దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అలాగే నిజామాబాద్ పట్టణంతో పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

సదాశివ నగర్ మండల కేంద్రంలో విద్యుత్తీగలపై పడిన ఫ్లెక్సీ