- Advertisement -
Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad Rains | హైదరాబాద్​లో మరోసారి భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

Hyderabad Rains | హైదరాబాద్​లో మరోసారి భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Rains | నగరాన్ని వానలు వీడటం లేదు. గత నాలుగు రోజులుగా నిత్యం సాయంత్రం సమయంలో వర్షం పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్​ (Hyderabad)లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వాన (Heavy Rain) కురిసింది. నిమిషాల వ్యవధిలోనే వరద ముంచెత్తింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్​ జామ్ (Traffic Jam) అయింది. కొన్ని ప్రాంతాల్లో వరదకు వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

- Advertisement -

Hyderabad Rains | కొట్టుకుపోయిన వాహనాలు

వనస్థలిపురంలో వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. టోలీచౌకి, హకీంపేటలో కూడా ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. అమీర్‌పేట్‌లోని గ్రీన్ పార్క్ హోటల్ వద్ద చెరువును తలపించేలా రోడ్డుపై నీరు నిలిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైతరాబాద్ ప్రాంతాలు నీటమునిగాయి. మోకాళ్ల ఎత్తు వరకు నీళ్లు నిలవడంతో.. వాహనదారులు గంటల కొద్ది రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు.

హైడ్రా (Hydraa), జీహెచ్​ఎంసీ సిబ్బంది నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్​ పోలీసులు ట్రాఫిక్​ క్లియర్​ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్​, ఇక్బాల్​ మినార్​, లక్డికాపుల్​, కేసీపీ జంక్షన్​ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్​ నిలిచింది. పీవీ నరసింహరావు ఎక్స్​ప్రెస్​ వేపై సైతం వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News