అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rain | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం heavy rain కురిసింది. శనివారం ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రం కాగానే మారిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతగా ఉండగా.. సాయంత్రం పలుచోట్ల వర్షం పడింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు scattered storms కురిశాయి. రాత్రి కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వాన thunder storms పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
