Nizamabad city
Nizamabad city | నగరంలో భారీ వర్షం.. విరిగిపడిన వృక్షం

అక్షరటుడే, ఇందూరు​: నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా నగరంలోని పులాంగ్​ చౌరస్తా సమీపంలో ఓ భారీ చెట్టు సాయంత్రం సమయంలో నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే ట్రాఫిక్​ సీఐ ప్రసాద్​, ఏఎస్సై శ్రీనివాస్​రెడ్డి, హెడ్​ కానిస్టేబుల్​ కేశవ్​, సిబ్బంది ప్రసాద్​, రమేశ్​, ఉదయ్​ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను మళ్లించారు. అనంతరం జేసీబీ సహాయంతో చెట్టును తొలగింపజేశారు.