Homeజిల్లాలుకామారెడ్డిHeavy rain | నిజాంసాగర్‌లో భారీ వర్షం

Heavy rain | నిజాంసాగర్‌లో భారీ వర్షం

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Heavy rain | నిజాంసాగర్ మండల nizamsagar mandal కేంద్రంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. స్థానిక గాంధీ చౌరస్తాలో డ్రెయినేజీలో (drainage) నీరు పొంగి ప్రవహించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. మరోవైపు వరద నీటికి రోడ్లపై ఉన్న గుంతలు ప్రమాదకరంగా మారాయి. రాత్రి వేళ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు చెబుతున్నారు.