అక్షరటుడే, వెబ్డెస్క్:Mumbai | ముంబైలో భారీ వర్షాలు(Heavy Rains) పడుతున్నాయి. సోమవారం వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది.
వర్షాల దాటికి ముంబైలో ఇటీవల ప్రారంభించిన ఆచార్య ఆత్రే చౌక్ స్టేషన్ మెట్రో లైన్-3 (ఆక్వా లైన్) జలమయం అయింది. స్టేషన్ పైకప్పు నుంచి నీరు ఊరవడంతో అక్కడ భారీగా వరద నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అంతేగాకుండా అధికారులు రైళ్లను రద్దు చేసి, స్టేషన్ను మూసివేశారు. పైకప్పు సక్రమంగా లేకపోవడంతోనే నీరు స్టేషన్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా స్టేషన్లోకి వరద నీరు రావడంతో మూసివేస్తున్నట్లు ముంబై మెట్రో అధికారులు (Mumbai Metro officials) తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.